TEJA NEWS TV : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదావని కన్నడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రగడి నాడిన కన్నడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిపారు. మరియు ఈనెల 10వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి వరకు ఆదోని లోని వీరసేవ కళ్యాణమండపంలో శిశిర సంభ్రమ మరియు ఆంధ్ర గడి కన్నడ సంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు,మరియు ఉత్సవాలు భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రముఖులు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ పరిధిలోని కులమతాలకతీతంగా కన్నడ అభిమానులందరూ పాల్గొనాలని సంఘం నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధావని కన్నడ సంఘం అధ్యక్షులు శరణబసప్ప, ఉపాధ్యక్షులు ప్రతాప్, కోశాధికారి సుగురప్ప, సంఘం నాయకులు దేశాయి చంద్రన్న, మరలిరాధ్య, విశ్వనాథ్, నాగేంద్రప్ప, మల్లికార్జున స్వామి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆదోని: ఫిబ్రవరి 10న శిశిర సంభ్రమ మరియు ఆంధ్ర గడి కన్నడ సంస్కృతిక ఉత్సవాలు
RELATED ARTICLES