
TEJA NEWS TV ( Adoni Reporter Ramesh )
ఆదోని ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గారికి, సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకులు యం.తాహేర్ వలి, పులి రాజు,రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆదోని నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలకు పేద ప్రజలకు వైద్యం కోసం పెద్దదిక్కుగా ఉంది కానీ ఈ ఆసుపత్రిలో తాగటానికి మీరు కనీస సౌకర్యాలు అయినటువంటి బాత్రూంలు, మంచాలు, వైద్యులు వైద్య సిబ్బంది వైద్య పరికరాల కొరతతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం వైద్యానికి పెద్దపీట వేసామని పత్రిక మీడియా లో మాత్రం గొప్పగా చెప్పుకుంటుంది. మేము తెలిపినటువంటి ఈ సమస్యలన్నిటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజల అసౌకర్యానికి గురి కాకుండా మెరుగైనటువంటి వైద్యం అందించాలని కోరుచున్నాము.
*ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తక్షణమే పరిష్కరించవలసిన సమస్యలు*
1. ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపి జరిగేటట్లు చర్యలు తీసుకోండి.
2. ఆసుపత్రిలో వైద్యుల, వైద్య సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయండి.
3.ఎమర్జెన్సీ రూమ్ పక్కన వాషింగ్ బేషన్ మరమత్తులు చేయాలి.
4. వైద్యులు చూసే రూమ్ దగ్గర రోగులు వేసి ఉండేందుకు కుర్చీలు మరమ్మత్తులు చేయాలి.
5. రక్త పరీక్ష కేంద్రం వద్ద మహిళలకు పురుషులకు విడివిడిగా బాత్రూంలో ఉన్నాయి వాటిని మరమత్తులు చేయాలి.
6. పైన పురుషుల సర్జికల్ వార్డు 53 లో బాత్రూంలోకి వెంటనే తలుపులు, లైట్లు, ఏర్పాటు చేయాలి.
7. పైన స్త్రీల సర్జికల్ వార్డు 48 లో బాత్రూములు తలుపులు వేశారు వెంటనే మరమ్మతులు చేయాలి. ఒక ఫ్యాన్ తిరగడం లేదు.
8.పోస్ట్ – ఆపరేటివ్ వార్డు పు, స్త్రీ రూమ్లలో బాత్రూములు పనిచేయటం లేదు. స్త్రీ రూమ్ ఫ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదు.(కంటి ఆపరేషన్ చేసుకున్న వృద్ధులు ఉంటారు)
9. పైన ఉన్న ఆర్వో మినరల్ ప్లాంట్ పనిచేయటం లేదు.
10. స్పెషల్ రూమ్ లు పేరుకి స్పెషల్ గా ఉన్న ఎలాంటి సౌకర్యాలు లేక ఉన్నాయి వాటిలో ఉన్న సమస్యలన్నీ తిని మరమ్మతులు చేయాలి.
11. చిన్నపిల్లల వార్డులో బాత్రూములు పనిచేయటం లేదు మరమ్మత్తులు చేయండి.
12. స్త్రీల మెడికల్ వార్డులో ఆరు బాత్రూములకు గాను ఒక బాత్రూమ్ మాత్రమే ఉపయోగంలో ఉంది దానికి కూడా డోర్ లేక మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
13. పురుషుల మెడికల్ వార్డులో రెండు ఫ్యాన్లు పనిచేయటం లేదు. బాత్రూములు లలో లైట్లు ఏర్పాటు చేయాలి.
14. ఆసుపత్రిలో అన్ని వార్డులు వరండాలు రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలి.
15. శానిటేషన్ సిబ్బంది కొరత ఉంటే వెంటనే తగిన సిబ్బందిని నియమించాలి.
16.శానిటేషన్ కార్మికులకు చాలీచాలని జీతాలు కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 వేల రూపాయలు వేతనం చెల్లించాలి.
17. కొంతమంది సిబ్బంది రోగులతో రోగుల సహాయకులతో ఆప్యాయంగా పలకరించకుండా గట్టిగా ఆవేశంతో మాట్లాడటంతో ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు.
18. కొందరు నర్స్ లు పనులు శానిటేషన్ వర్కర్స్ తో చేస్తున్నారు శానిటేషన్ వర్కర్స్ వారి పని వారు చూసుకోవాలి.
19. రక్త పరీక్ష కేంద్రంలో ఒకేషనల్ విద్యార్థులతో అన్ని పనులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.వారితో పని చేయించడం కాకుండా ముందు చూపించే ప్రయత్నం చేయాలి.
20. ఆసుపత్రి కు రోగుల సహాయకులు బంధువులకు భోజనాలు చేసేందుకు ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేయాలి.
21. ఆసుపత్రిలో రోగితోపాటు రోగి అటెండర్ కు కూడా భోజనం ఇవ్వాలి, భోజనం రోజు మెనూ ప్రకారం అందేలా చర్యలు తీసుకోవాలి.
22. వెంటిలేటర్ ఉన్న సంబంధిత వైద్యులు లేకపోవడంతో పరికరాలు వృధాగా ఉన్నాయి వెంటనే వైద్యులను నియమించండి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రకాష్, నరసింహులు, ఉరుకుందు, అయ్యప్ప, వీరేష్, మహేంద్ర, ఉదయ్ కుమార్, జయరాజ్, నరసన్న, ఈరన్న, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు



