TEJA NEWS TV Adoni Reporter Ramesh :
ఖాళీగా ఉన్న మెగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ఆదోని పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర బిజెవైయం పట్టణ అధ్యక్షులు *ఏకబొటే శ్రీకాంత్* అధ్యక్షతన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెవైయం జిల్లా అధ్యక్షులు తలారి సుధాకర్ మాట్లాడుతూ మెగా జాబ్ క్యాలెండర్ మరియు మెగా డిఎస్సి ని వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క 10 విరమణ వయసు 62 సంవత్సరాల నుండి తిరిగి యధావిధిగా 52 సంవత్సరాలకు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. బిజెపి జిల్లా కార్యదర్శి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పోస్టులు 50,677 ఉంటే కేవలం 15000 ఉద్యోగాలు ఏ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ లోకేష్,జిల్లా ఉపాధ్యక్షులు అంజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఊరుకుండు గౌడ్,నాయకులు సంజయ్ పండే,లక్ష్మీకాంత్,కాశి, ముకేశ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.