తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో కల్కి కోచింగ్ సెంటర్లో ఈరోజు టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు.
సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం ను ప్రకటించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అసంకృతి వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను మరియు కార్యకర్తలను ఏ ఒక్కరిని అడగకుండా ఒక వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలంను సత్యవేడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిన ఆదిమూలం కు ఎలా టికెట్ ఇస్తారని ఆగ్రహించారు.
ఆదిమూలం కి మేము సపోర్ట్ చేయము మా పైనే కేసులు పెట్టి కక్ష సాధించిన ఒక అవకాశవాది… ఆదిమూలంకి తప్ప ఇంకా ఎవరికైనా టికెట్ ఇచ్చినా మేమందరం కలిసి పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చలపతి నాయుడు, మధునాయుడు (మాజీ సురుటిపల్లి దేవాలయం మెంబరు), హరినాయుడు, మండల ప్రధాన కార్యదర్శి యం. దశరధన్, సీనియర్ నాయకులు సునీల్, రాజారాం, కుమార్, శివ, అజయ్, పృధ్వీ.నాగరాజు. గోవిండయ్య. తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.
ఆదిమూలం వద్దు చంద్రబాబు ముద్దు
RELATED ARTICLES