TEJA NEWS TV
బుచ్చిరెడ్డిపాలెం 05 ఏప్రిల్ తేజన్యూస్ టీవీ
నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం బుచ్చి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షలు కోలగట్ల సురేష్ మాట్లాడుతూ ఈ జిల్లాలో దాదాపుగా 50వేల ఆటోలను నమ్ముకుని కార్మికులు జీవనం సాగిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వకానీ, ఇప్పుడు అధికారంలో వున్న కూటమి ప్రభుత్వాలు ఆటో కార్మికులపై జీవో నెంబర్ 21 పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఆర ఇబ్బందులు పెడుతున్నాయి. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏర్పాటు చేసిన వాహన మిత్ర పథకాన్ని, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన ఇంతవరకు అమలు చేయలేదు. అంతేకాకుండా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో రవాణా రంగం పై కేంద్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలతో కూడిన చట్టాన్ని తీసుకొచ్చి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఇచ్చేటటువంటి బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఆర్టిఏ కార్యాల యాలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీనివలన జిల్లాల్లో ఉండే ఆర్టిఏ కార్యాలయాలను కూడా సర్టిఫికెట్లు ఫిట్నెస్ అధికారం కోల్పోతాయన్నారు. కాబట్టి వాహనాల సెన్సార్ ట్రాకింగ్ పద్ధతిని రద్దు చేయాలని లేని పక్షంలో వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఏ విధంగా అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారో అదే విధంగా మంజూరు చేయాలని ఈ సెన్సార్ ట్రాకింగ్ పద్ధతిని ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ అధికారులే నిర్వహించాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున, షేక్ జానిబాష,ఆటో కార్మిక సంఘం మండల కార్యదర్శి రాదయ్య, రమేష్ మరియు ఆటో కార్మికులు సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES