TEJANEWSTV
ఆంధ్ర మద్యం విక్రయ వ్యాపారానికి గండి కొడుతున్న కర్ణాటక మద్యం వ్యాపారాలు..
కర్ణాటక మద్యం వ్యాపారుల నుంచి మామూళ్ల మత్తులో ఆంధ్ర ఎక్సైజ్ సివిల్ పోలీసులు ..
రాత్రి వేళల్లోనే లక్ష్యంగా కర్ణాటక మద్యం ఆంద్రాకు సరఫరా..
పట్టించుకోని ఆంధ్ర ఎక్సైజ్ పోలీస్ ఉన్నతాధికారులు..
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి, రోళ్ళ. గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లోని కర్ణాటక, ఆంధ్రకు సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల్లో కర్ణాటక మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్నా వీటిని అరికట్టే సంబంధిత ఆంద్రాకు చెందిన ఎక్సైజ్, పోలీస్, అధికారులు మాత్రం కర్ణాటక మద్యం విక్రయదారులతో కుమ్మక్కై వారి నుండి మామూళ్ల ను తీసుకుంటూ తూతూ మంత్రంగా నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకొని వెళుతున్నట్లు గ్రామాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మండలాల చుట్టూ దాదాపు 100 సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. కర్ణాటకలో ఆ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ బార్లు, హోల్ సేల్ దుకాణాల నిర్వహణకు అనుమతులు ఇవ్వడంతో నిర్వాహకులు వాటిని ప్రారంభించారు.ఆంధ్ర సరిహద్దు గ్రామాలకు సమీపంలో దాదాపు 30 బార్లు, మద్యం దుకాణాలు ఉన్నాయి.కర్ణాటక భూభాగంలో వాటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర మద్యం ధరలకు కర్ణాటక మద్యం ధరకు ఒక్కో బాటిల్ 5 నుంచి 10 రూపాయలు వరకు వ్యత్యాసం ఉన్న కారణంగా చాలా మంది ఆంధ్రకు చెందిన మద్యం ప్రియులు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆంధ్ర కు సమీపంలోని కర్ణాటక గ్రామాలకు వెళ్లి మద్యం సేవించి వస్తుంటారు. దీంతో కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాల్లో రోజూ మద్యం దుకాణాల వద్ద బారులు తీరడంతో కర్ణాటకకు చెందిన మద్యం వ్యాపారులు ఆంధ్రకు చెందిన మద్యం ప్రియుల అవసరాన్ని ఆసరా చేసుకుని వారికి మద్యం పంపిణీ చేస్తుంటారు. దీంతో రోజు ఆంధ్రకు చెందిన మద్యం ప్రియులు తాగడానికి లక్షలాది రూపాయలు కర్ణాటక మద్యం వ్యాపారులకు తగలేస్తూ కర్ణాటక మధ్య వ్యాపారులకు ఆదాయాన్ని పెంచుతున్నారు. ఇదే గాక రోజు రాత్రి వేళలో కర్ణాటక మద్యం వ్యాపారులు ఆంధ్రకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తూ రోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు .ఆంధ్ర కర్ణాటక మద్యం ధరలతో వ్యత్యాసం ఉండటంతో నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆంధ్ర కు చెందిన మద్యం ప్రియులు తరచూ కర్ణాటకకు వెళ్లి తాగి వస్తుంటారు. ఇదిలా ఉండగా కర్ణాటక నుండి మద్యం అంగళ్ల నిర్వహకులు మరీ ముఖ్యంగా చీప్ లిక్కర్ రాజ విస్కీ టెట్రా పాకెట్ లు మడకశిర నియోజకవర్గం లోని గుడిబండ, అమరాపురం, రోళ్ళ. అగలి, మడకశిర మండలంలోని సమీప గ్రామాలకు కర్ణాటక మద్యం విక్రయదారులు రాత్రి వేళల్లోనే లక్ష్యంగా పెట్టుకుని వాహనాల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. కర్ణాటక మద్యం విక్రయదారులు.ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో ఆటోల్లో కర్ణాటక మద్యం యదేచ్చగా విక్రయిస్తున్నారు. దీంతో ఆంధ్ర మధ్యo విక్రయానికి కర్ణాటక మద్యం విక్రయదారులు గండి కొడుతున్నట్లు గ్రామాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సిన సంబంధిత ఎక్సైజ్, సివిల్ పోలీస్ అధికారులు. కంచె చేను మేస్తే కాపు ఏమి చేయను అనే చందంగా కర్ణాటక మద్యం వ్యాపారం నుండి నెల నెల మామూళ్లు తీసుకొని ఆంధ్ర కు చెందిన మద్యం వ్యాపారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి ఆంధ్రాలో ఏరులై పారుతున్న చీప్ లిక్కర్ రాజ విస్కీ టెట్రా పాకెట్ కర్ణాటక మధ్యాన్ని అరికట్టి ఆంధ్ర మద్యం దుకాణాలకు ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల్లోని ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
ఎక్సైజ్ సీఐ వివరణ:- ఈ విషయమై మడకశిర ఎక్సైజ్ సిఐ మురళీ కిషోర్ ను విలేకరులు వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఆంధ్ర సరిహద్దుల్లో ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం..
RELATED ARTICLES



