

TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం గ్రామంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతి హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా , పీఠాధిపతి శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారి ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ నరసింహారెడ్డి సూచనల మేరకు భక్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
నంద్యాలకు చెందిన జ్యోతి ఫార్మా వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో స్వాతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అభిలాష్ వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్న రోగులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వాతి హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.