రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
TEJANEWSTV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు పోలీసు శాఖపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరిగిందని రూరల్ సీ.ఐ. బీవీ రమణ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మే ఎగువ దిగువ, అహోబిలం క్షేత్రాలలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సుమారు 70 మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీస్ శాఖ చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది జరగడం జరగలేదని తెలిపారు .
ఎగువ అహోబిలంకు కార్లలో, వాహనాలలో వెళ్లే భక్తులకు కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు సి.ఐ రమణ తెలిపారు.
అహోబిలం ముక్కోటి ఏకాదశి సందర్భంగా 70 మంది తో బందోబస్తు ఏర్పాటు..
RELATED ARTICLES



