రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
TEJANEWSTV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది. వణికిస్తున్న చలి పులిని కూడా లెక్కచేయకుండా భక్తులు శ్రీ స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను, ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారాలను తెరిచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. Q లైన్ల గుండా భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు.
అహోబిలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి పోటెత్తిన భక్తులు
RELATED ARTICLES



