


రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ :ఆళ్లగడ్డ
TEJANEWSTV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం క్షేత్రంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యోగివేమన రెడ్ల నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దేవస్థానం స్వాతి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆళ్లగడ్డ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ M.D డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి రెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ హనీషా, డాక్టర్ చంద్రిక, డా. రామలక్ష్మి తదితరులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ డా. నరసింహారెడ్డి మాట్లాడుతూ .. అహోబిలం కొండ ప్రాంతంలో ఉండడంతో ఎక్కువగా మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుమారు 1200 మంది పేషంట్లను వైద్యులు పరిశీలించి వైద్య చికిత్సలు అందించారు. అలాగే వైద్య శిబిరానికి హాజరైన రోగులందరికీ ఉచితంగా అల్పాహారం, భోజన సదుపాయాలను కూడా సత్రం యాజమాన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిఖిత్ రెడ్డి, స్వాతి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సాయి తేజస్విని, ఫార్మాసిస్ట్ మధు సూదన్, సిబ్బంది అజయ్ కుమార్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.



