


రిపోర్టర్ పి.శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని శనివారం ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి దర్శించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం CAO వీఎల్ఎన్ రామానుజన్, ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన గోత్రనామాలతో అర్చకులు శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి అష్టోత్తర శతనామ పూజలు, శ్రీ అమృతవల్లి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితులు రంగమంటపంలో గంగులకు వేద ఆశీర్వచనం పలికి శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.



