Thursday, March 13, 2025

అహోబిలంలో భద్రత చర్యలను స్వయంగా పరిశీలించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అహోబిలం  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుచున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రజలు ఎక్కువగా తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది. కావున నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ N.యుగంధర్ బాబు గారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించడం జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు రానున్న సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.

మోటార్ బైకులు, ఆటోలు, కార్లు మొదలగు వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఎగువ మరియు దిగువ అహోబిలం టెంపుల్ క్యూలైన్లు, కళ్యాణోత్సవం జరుగు ప్రదేశంలోని VIP గ్యాలరీలు మరియు జనరల్ గ్యాలరీలు, ఎంట్రీ మరియు ఎగ్జిట్ లను  వాహనాల పార్కింగ్ మొదలగు ప్రదేశాలను అడిషనల్ ఎస్పీ గారు స్వయంగా పర్యటించి భద్రతా చర్యలను పరిశీలించడం జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఎలాంటి అంతరాయం లేకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీకు అప్పగించిన ప్రదేశాలలో విధులు నిర్వహిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,నంద్యాల

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular