భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ మండలం
22.11.2025
అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెరుగుతోందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, గత రెండేళ్లలోనే కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
చండ్రుగొండ మండలంలోని తుంగా రం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ చీరల పంపిణీ, సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేస్తామని ఆయన అన్నారు.
స్థానిక కేడర్ కాంగ్రెస్ వైపు ఆకర్షితమవుతుండగా, నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




