భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 13-11-2025, గురువారం
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నేడు గండుగులపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, వినాయకపురం, వేదంతపురం, అశ్వారావుపేట ప్రాంతాల్లో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గండుగులపల్లి ZPHS పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసి, చదువుతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం ₹16.46 లక్షల విలువైన CMRF చెక్కులను అందజేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులతో మాట్లాడి, పంట కొనుగోలు త్వరగా జరగాలని అధికారులను ఆదేశించారు.
వినాయకపురం, వేదంతపురం గ్రామాల్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు.
అశ్వారావుపేట మినీ స్టేడియం, రోడ్ల విస్తరణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
“రాజకీయాలు పదవికోసం కాదు, సేవకోసం. ప్రజల సమస్యల్లో నేను ఎప్పుడూ అండగా ఉంటాను,” అని ఎమ్మెల్యే తెలిపారు.
పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.






