
TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపాన నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ శిరిడి సాయిబాబా నూతన మందిర నిర్మాణంలో శ్రీ శిరిడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గురువారం అశేష భక్తజనుల మధ్య విశేషంగా జరిగింది.
తెల్లవారుజామునే ఆలయ కలేశం ప్రతిష్ట పూజా కార్యక్రమాన్ని యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టించారు.
అనంతరం వేద పండితుల మధ్య స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తరపున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి తరలివచ్చిన ముఖ్య అతిధులు……
శ్రీ శిరిడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర రోడ్డు భవనల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంబాబు,మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కేఈ ప్రతాప్,ఆల్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ తమ్ముడు భూమ విఖ్యాత్ రెడ్డి,ప్రభుత్వ ఉన్నత అధికారులు హాజరు కావడంతో వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.