Monday, June 2, 2025

అయ్యన్నపాలెంలో సిసి రోడ్డు పనులకు శుభారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 30-05-2025
చండ్రుగొండ,


చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి టి.కాంతయ్య ఇంటివరకు నిర్మించనున్న సిసి రోడ్డుకు మండల కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థానిక అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ  సహకారంతో గ్రామానికి ఈ అభివృద్ధి సౌకర్యం లభించిందని, ఆయనను కోరిన వెంటనే స్పందించి రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా తీసుకొచ్చిన ఈ చర్యలకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి సురేష్, సారేపల్లి శేఖర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, ఎన్.ఎస్.యు. మైనారిటీ విభాగం అధ్యక్షుడు వసీం పాషా, రాంబాబు, నాగేంద్ర ప్రసాద్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular