అమెరికాలో వైయస్ఆర్ 76 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ కన్వీనర్ కడప రత్నాకర్ మాట్లాడుతూ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేదల పక్షపాతిగా, రైతుల అభివృద్ధికి కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా దేశానికే మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. వైయస్ఆర్ ఆశయాల సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తన అదృష్టమని, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలనలో దేశానికే ఆదర్శమని అన్నారు. పార్టీ బలోపేతం కావాలని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అమెరికాలో ఘనంగా వైయస్ఆర్ 76వ జయంతి వేడుకలు
RELATED ARTICLES