అమరవీరుల వారోత్సవాలను ఘనంగా జరపండి.
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి :
జగన్
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మావోయిస్టులు లేక విడుదల చేశారు.
జూలై 28 నుంచి ఆగస్టు మూ
డో తేదీ వరకు జరిగే అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వారోత్సవాలను ఘనంగా జరపాలని, నక్సల్ బరి ప్రజా యుద్ధ బాటే – దేశ విముక్తికి మార్గమని, ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక ఆపరేషన్ కగారును ప్రజా ఉద్యమాల ద్వారా ఓడించాలని కోరారు.భారత విప్లవ మార్గదర్శకులు చారు మజుందార్, కన్హాయ్ చటర్జీలు జూలై నెలలోనే అమరులయ్యారని, గడచిన 50 సంవత్సరాల కాలంలో ఎంతోమంది వీర యోధులు, వీరవనితలు వివిధ ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి సంవత్సరం జూలై 28న సంస్మరణ వారాన్ని జరుపుకుంటామని ఆ సంగతి ప్రజలకు విధితమేనన్నారు. ప్రతిఘాతక సూరజ్ కుండు, ఆపరేషన్ కగారును ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా 200కు మందికి పైగా కామ్రేడ్స్ అమరులు అయ్యారని వారందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తుందన్నారు.
నవభారత్, వికసిత్ భారత నిర్మాణం పేరుతో 2047 వరకు దేశాన్ని హిందుత్వ రాజ్యాంగ నిర్మించే లక్ష్యంతో బిజెపి పార్టీ సామ్రాజ్యవాదుల దళారీ పాలకుల ఎజెండాను ముందుకు తీసుకుపోతుందని, దానికి అనుగుణంగానే విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా చొచ్చు కొచ్చేలా నిబంధనలను సరళతరం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలతోపాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అనే వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో చేతులు కలిపి ఎన్కౌంటర్లకు పాల్పడుతుందని, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కలు అమిత్ షా ను కలిసి మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అదనంగా నిధులు కావాలని కోరుతున్నారన్నారు. ప్రజా పాలనా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సామ్రాజ్యవాదులకు, దేశీయ విదేశీ బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని.ప్రజా యుద్ధంలో అమరులైన ప్రతి ఒక్కరికి జోహార్లు అర్పిస్తూ,అమరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పత్రికా ప్రకటనలో జగన్ తెలిపారు.