మెదక్ జిల్లా, చేగుంట మండల పట్టణ కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతా రామ కాలనీలో గణేశుని దర్శించుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, అలాగే మల్లికార్జున ఫ్రెండ్స్ యూత్ గణేశుని మండపం ను సందర్శించి గణేశుని కృపకు పాత్రులైనారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించినారు. మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ని ఆయా మండపాల యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించినారు. వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న దాన ప్రసాదము వడ్డించి దేవుని కృపకు పాత్రులు అయినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,రైతులకు అధికంగా పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని అధికంగా పంటలు పండాలని వారు దేవుడిని కోరుకున్నారు.
అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న చేగుంట మాజీ ఎంపీపీ
RELATED ARTICLES