Tuesday, July 1, 2025

అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం -డీసీసీ నాయకులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి/బీబీపేట్ : తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పధకం క్రింద పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతు నేస్తం  కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచే రైతు భరోసా పధకం క్రింద డబ్బులు జమ అవుతాయని ప్రకటించి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నదాతలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వుంటుందని స్పష్టం చేశారన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అర్హులైన రైతులందరికీ ఎకరాలతో సంబంధం లేకుండా వారి ఖాతాల్లో ఎకరాకు రూ 6,000 చొప్పున జమ చేసేందుకు నిధులు కేటాయించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ యావత్ రైతాంగానికి తీపి కబురు అందించారన్నారు ప్రజా పాలనలో వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేయాలని రైతులకు ఆర్థికంగా చేయూత అందించి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావాలన్నదే  ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వానాకాలం పంట సాగు ప్రారంభానికి  రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు  సకాలంలో పంట పెట్టుబడి సాయం అన్నదాతకు అందించడం ద్వారా విత్తనాలు, ఎరువులు వ్యవసాయపు అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు జిల్లా రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, టీ పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular