బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే కోసిగి సిద్ధప్పపాలెం బృందావన నగర్ లో నివాసం ఉండే వడ్డే ఎంకన్న కుమారుడు వడ్డే రాముడు అనే 40 సంవత్సరాలు వయసుగల వ్యక్తి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైల్వే ట్రాక్ పక్కన గల ఖాళీ ప్రదేశంలో బహిర్ భూమికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటలైనా ఇంటికి రాకపోవడంతో ఏమైందో అన్న అనుమానంతో భార్య తన పక్కింటి పిల్లలను చూసి రమ్మని పంపించగా బహిర్ భూమికి వెళ్లే ప్రదేశంలో రాముడు కిందపడి ఉండటాన్ని గమనించి పిల్లలు తమ కాలనీవాసులకు తెలియజేశారు. కాలనీవాసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య భార్య వడ్డె ఉలిగమ్మ ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇళ్ల నిర్మాణంలో మేస్త్రి పని చేస్తూ కాంట్రాక్టర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్న వడ్డే నాగరాజు మృత్యువాత పడటంతో తన భర్తను ఎవరో కావాలనే హత్య చేశారని బార్య మరియు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం బాడిని ఆదోనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వడ్డే రాముడు మరణానికి అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
RELATED ARTICLES