Tuesday, December 24, 2024

అగ్రకులానికి చెందిన వ్యక్తిని యూత్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించడంలో మర్మమేమిటి?.

నియంత నిర్ణయాలకు పరాకాష్ట.

దళితుడు పార్టీ జెండా మోయడానికైనా?

యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా?

నియంత ఆలోచనలకు పరాకాష్టగా మండల నాయకత్వం మా?.

మండల కాంగ్రెస్ పార్టీలో పరిపక్వత లోపించింది అన్నట్టుగా వారి వైఖరి ఏమిటి.?

మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా దళితుడు పోటీ చేస్తే మండల నాయకత్వానికి భయం ఎందుకు?.

ముందుగానే అగ్రకులానికి చెందిన వ్యక్తిని యూత్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించడంలో మర్మమేమిటి?.

అలా ప్రకటించడం వల్ల లాభమేంటి?.

వెంకటాపురం మండల కేంద్రంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడిగా దళిత సామాజిక వర్గానికి చెందిన రావుల నాని పోటీ చేస్తే మండల నాయకత్వంలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో అతను పోటీ చేయకుండా విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీలో అడుగులో మడుగులోతుతున్న పరిస్థితులు,ఉన్నాయి, అంటూ బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.దాన్ని నిజం చేస్తూ సాయి అనే మరొక యువకుడ్ని మండల కమిటీ ఏకగ్రీవం గా ఎన్నుకోవడం వారి పరిపక్వృత్తలేని ఆలోచనను బహిర్గతం చేసింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మండల పార్టీ ఎన్నుకుంటుందా?.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మండల పార్టీ ఎన్నుకోదు అనే విషయం కొన్ని పత్రికలకు తెలియదా?. లేదా తెలిసి ప్రచురించారా?
లేదా పార్టీ ఎత్తుగడలో వీళ్లు కూడా ఒక భాగమేనా?.
మండల నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విధానాన్ని ప్రచురించడం యూత్ఎలక్షన్ కమిషన్ ని తప్పుపట్టినట్టే అవుతుంది కదా?.
సవ్యంగా యాప్ ద్వారా జరిగే ఎన్నికలను ఎందుకు తప్పు పట్టిస్తున్నారు?.
ఈ విషయం కొన్ని పత్రికలకు తెలియదా?
మండలంలో సుమారు యూత్ అధ్యక్షుడి స్థానానికి నలుగురు పోటీ చేయగా ఈ నలుగురిలో రావుల నాని దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కీ యూత్ బలం బలగం వెంకటాపురం మండలంలో అధికం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతనికి ఉన్న యూత్ ఫాలోయింగ్ చూసి కాంగ్రెస్ అగ్ర నేతలు సైతం కారాలు మీరాలు నూరుతున్నారంటే ఆయన బలగం ఏంటో అర్థం అవుతుంది. కొంత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అతని యూత్ ఫాలోయింగ్ చూసి మండల నాయకత్వాన్ని మించిపోయేలా ఉన్నాడని గ్రహించి తొలి దశలోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ విరమించే విధంగా, కసరత్తులు చేశారని మండలం అంతా కోడెక్కుస్తోంది. మొన్నటి వరకు అంతర్గతంగా రెండు వర్గాలుగా ఏర్పడిన కాంగ్రెస్ మండల నాయకత్వం రావుల నానికి ఉన్న యూత్ ఫాలోయింగ్ చూసి యూత్ అధ్యక్షుడు విషయంలో ఇరు వర్గాలు ఏకమై ఏకగ్రీవంగా వారి కులానికి చెందిన వారిని ఎన్నుకోవడం. పట్ల వారి వైఖరి రావుల నాని పై ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది అని మండలoలో యూత్ అంతా మండల కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా రావుల నాని
కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ ఓడిన గెలిచిన పార్టీతోనే ఉన్న యువకురటం పార్టీ జెండా మోయడానికి తప్ప యూత్ అధ్యక్షుడిగా పనికిరాడు అనే సంకేతాలు పరోక్షంగా మండల నాయకత్వం ఇవ్వడంపై దళితుడికి పెద్ద పీట వేసాము అన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మండల యూత్ అధ్యక్షుడు స్థానానికి చిన్న పీట వేయలేని పరిస్థితిలో ఉందా అంటూ పలువురు కాంగ్రెస్ అధిష్టాన నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి తోడు యూత్ అధ్యక్షున్ని యాప్ సిస్టం ద్వారా ఎన్నుకోబడతారు అనే విషయం మరిచారో ఏమో రావులన్న నీపై ఈ దమనకాండ చాలా దారుణమని, పలువురు విమర్శిస్తున్నారు మండలంలో నానికి ఉన్న బలం అది వర్ణించలేనిది అని చెప్పాలి. యూత్ కూడా రావుల నాని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అంటూ యావత్ మండల యూత్ ప్రజానీకం కోరుకుంటుంది. ఏదిఏమైనాప్పటికీ పార్టీలో పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తపై సరైన ఆలోచన చెయ్యలేని పరిస్థితిలో మండల నాయకత్వం ఉంది అని వారి వైఖరి మరోసారి రుజువు చేసినట్టుగా వెలువడిన నేపథ్యంలో ,ఇటువంటి పరిపక్వత, అర్థం లేని మండల నాయకత్వం ఎత్తుగడలా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular