తేజ న్యూస్ టివి ప్రతినిధి.
జోరుగా సాగుతోంది మొరం తరలింపు
సంగెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కే వంశీ కృష్ణ మరియు కానిస్టేబుల్స్ కిషోర్, కార్తీక్ ఎల్గూర్ రంగంపేట గ్రామ శివార్లలో పెట్రోలింగ్ చేయుచుండగా, వారికి ఒక టిప్పర్ మొరం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం మేరకు వెళ్లగా అక్కడ ఒక టిప్పర్ మొరం ను తరలిస్తుండగా ఎస్సై పట్టుకొని సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తెచ్చి కేసు పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మొరం తరలింపు కు సరైన పత్రాలు లేకుండా మొరం తరలింపు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్రమ మొరం టిప్పర్ ను పట్టుకున్న సంగెం ఎస్ఐ కే వంశీకృష్ణ
RELATED ARTICLES



