ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ హైవే 65 నందు వత్సవాయి మండలం భీమవరం క్రాస్ రోడ్డు వద్ద జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో రామాపురం క్రాస్ రోడ్ లో గల మద్యం దుకాణాల నుండి పల్నాడు జిల్లా అమరావతికి 20 కేసుల మద్యం ను తీసుకెళుతున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనమును సీజ్ చేసి అందులో రవాణా చేస్తున్న మొత్తం 960 మద్యం సీసాలను అనగా 172.8 లీటర్ల మద్యo ను స్వాధీనం చేసుకోవటం జరిగింది. పల్నాడు జిల్లా అమరావతి నివాసి అయిన పాణ్యం మోహన్ రావు ఆగస్టు 15న మద్యం షాపులకు సెలవు కావటం చే తన స్వగ్రామంలో భారీగా మద్యం విక్రయాలు జరుపుటకు ఈ మద్యం సీసాలను తీసుకెళ్తున్నట్టు దర్యాప్తులో తేలింది. సీజ్ చేసిన మద్య విలువ సుమారు 1,38,240-/-రూపాయలు ఉంటుందని అంచనా వేయడమైనది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ డి.జ్యోతి, కానిస్టేబుల్స్ ఎస్. కిషోర్ బాబు మరియు కే విజయ కుమారి లను జగ్గయ్యపేట స్పెషల్ అండ్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి అభినందించారు.
అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట; స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం
RELATED ARTICLES