TEJA NEWS TV: జై భీమ్ MRPS మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి సంగటి యోహాన్ మాదిగ ఆధ్వర్యంలో నేడు మంత్రాలయం పోలీస్ స్టేషన్ లో జై భీమ్ MRPS నాయకులును అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో జూను 01 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచేస్తునందుకు జై భీమ్ MRPS నాయకులును మందుగానే అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు, జగన్ మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు నేనున్నా, నేనువిన్న అని మాదిగల ఓట్లతో గద్దెన ఎక్కి వచ్చి,ఈ రోజున మాదిగల సమస్యలు చెప్పడానికి జగన్ కు చెబుదామని వెళ్ళితే అరెస్ట్ చేపిస్తారా, ప్రజాస్వామ్యంను కూని చేస్తే ఏ మాత్రం ఊరుకొనే ప్రసక్తే లేదని దుయ్యబట్టి,రాబోయే రోజుల్లో మాదిగలు సత్తా చూపిస్తామని మాట్లాడి అక్రమ అరెస్ట్, కేసులతో ఉద్యమాలను ఆపలేరు అవసరమైతే జై భీమ్ MRPS మిల్టెంట్ ఉద్యమాలకు సిద్దపడతామని మాట్లాడం జరిగింది.ఈ కార్యక్రమములో జై భీమ్ MRPS మంత్రాలయం నియోజకవర్గం నాయకులు అనిల్,,నరసింహులు, బాబు,గోపాల్,తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలు ఆపలేరు జై భీమ్ MRPS ఆగ్రహం
RELATED ARTICLES