మెదక్ జిల్లా చేగుంట గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో చేగుంట మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు విలేకర్లతో మాట్లాడుతూ ప్రపంచమంతా కొనియాడే ఒకే ఒక్క మహనీయుడు. విశ్వ విజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ నీ అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా సిగ్గుపడాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆ మహనీయుని పేరును స్మరిస్తూ వారి దేశాల్లో ఆయన విగ్రహాలని ఏర్పాటు చేసుకుని వారి పట్ల గౌరవం చాటు కుంటున్నారు. భారతదేశంలోని అన్ని కులాల మహిళలకు మరియు దేశంలో ఉన్న 92.5% ఉన్న బహుజనులకు అంబేద్కర్ అసలైన దేవుడన్నారు. అంబేద్కర్ ని అవమాన పర్చడం అంటే దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలను అవమాన పరచడమే అని,భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని అది పార్లమెంటు సాక్షిగా బయటపడిం దన్నారు.అంబేద్కర్ భిక్షతో అమిత్ షా హోం మంత్రి అయ్యాడని ఈ విషయం అమిత్ షా గుర్తు పెట్టుకోవాలన్నారు. బాబా సాహెబ్ జోలికి వస్తే ఖబర్ధార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుండి తప్పుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు బర్మావత్ శ్రీనివాస్ నడిమి తండా, తదితరులు పాల్గొన్నారు,
అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్రం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్
RELATED ARTICLES