

తేజ న్యూస్ – హోళగుంద
హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు
అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు సూచించారు. శనివారం స్థానిక సీజనల్ హాస్టల్ లో 70వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అందరివాడు యావత్ ప్రపంచం గుర్తించిన మహానేత అన్నారు.ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అత్యున్నత పదవులను అధిష్టించిన మహా పురుషుడు మహామనిషి కార్యసిద్ధి పట్టుదల ముందుకెళ్లడమే ఆయనకు తెలుసు 1947లో స్వతంత్రం వస్తే రెండేళ్లలో భారత రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా కృషిచేసిన ఘనత ఆయనదే అని తెలిపారు. ఇలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనమందరం గర్వించదగ్గ విషయం గర్వకారణం అని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14 -1891 సంవత్సరమున జన్మించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సోహెబ్ దుర్గయ్య సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



