నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం పరిధిలోని కొండ మాయ పల్లి, కొత్తూరు, మాచినేనిపల్లి గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మెమోలు జారీ చేసినట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ తేజేశ్వని తెలిపారు. గురువారం మండలంలోని ఆర్ కొత్తూరు , మాచినేనిపల్లి, కొండ మాయపల్లి గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడి కార్యకర్తలు కేంద్రాలలో గ్రోతు , మెనూ లకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో వారికి మెమోలు జారీ చేయడం జరిగిందన్నారు. రికార్డుల నిర్వహణలో అంగన్వాడి కార్యకర్తలు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈమె వెంట సూపర్వైజర్ లక్ష్మీదేవి ఉన్నారు.
అంగన్ వాడి కార్యకర్తలకు మెమో జారీ. రికార్డులను పరిశీలిస్తున్న సి డి పి ఓ, తేజేశ్వని.
RELATED ARTICLES