సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు వేడుకలను ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ సావిత్రిబాయి స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళ 1931 జనవరి 3న మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించింది అన్నారు స్త్రీ పురుషులు కుల మతాలకతీతంగా సమానంగా విద్యను అభ్యసించడం వల్ల సమాజ స్పృహ పెరుగుతుందని భావించిందని గుర్తు చేశారు 1848 సంవత్సరంలో తొలి మహిళ పాఠశాలను స్థాపించడమే కాకుండా అనాధ ఆశ్రమాలు కూడా స్థాపించి తన గొప్పతనం చాటుకుందన్నారు భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు అండగా ఉండి ఎన్నో సామాజిక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. గొప్ప కవి రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు పీడిత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు దళిత సమాఖ్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్ ఈ కార్యక్రమంలో బుడగ జంగాల నాయకులు రామాంజనేయులు, ముగ్గు గోవిందా, దళిత సమాఖ్య నాయకులు దేవేంద్ర, శివ ,వీరేష్, హుసేని, గోవిందు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హోళగుంద మండల కేంద్రంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
RELATED ARTICLES