TEJA NEWS TV
తేజ న్యూస్ టీవి -హోళగుంద మండలం కేంద్రంలో వైసిపి నాయకులు కార్యకర్తలు బుధవారం సంబరాలు చేశారు. ఈ సందర్భంగా, వైస్ సర్పంచ్ దొడ్డ బసప్ప గడిగే బసవ ,మండల కన్వీనర్ షఫీ ఉల్లా, వీరు,మాట్లాడుతూ చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని మరలా గుమ్మనూరు జయరామ్ కు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కార్యకర్తలు, నాయకులు, బస్టాండ్లో బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీకి విజయానికి, అహర్నిశలు కృషి చేస్తామని పార్టీ ఆదేశాలను పాటిస్తూ అభ్యర్థుల విజయానికి సహకరిస్తామన్నారు.
అదేవిధంగా కోగిలతోట లో వైసీపీ నాయకుడు తిమ్మప్ప మరియు ముద్దటమాగి లో వెంకటేష్ వైసిపి నాయకులు ,అభిమానులు, కార్యకర్తలు జడ్పిటిసి విరుపాక్షి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు బాణసంచా కాలుస్తూ ,సంబరాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షపివుల్లా, గడిగే బసవ , వైస్ సర్పంచ్ భర్త ,దొడ్డ బసప్ప ,నాగప్ప.ముల్లా రహంతుల్లా, ముల్లా హాఫిజ్ , సింధు వాళ హనుమప్ప, కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.
హోళగుంద బస్టాండ్ లో వైసీపీ నాయకులు సంబరాలు
RELATED ARTICLES