Wednesday, March 19, 2025

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలన్న సీఐ వెంకటరాజా గౌడ్

TEJA NEWS TV : హోలీ పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని సీఐ వెంకటరాజా గౌడ్ ప్రకటన విడుదల చేశారు. హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండగను ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించాలని సూచించారు.ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం, మద్యం సేవించి వాహనం నడపడం చట్ట విరుద్ధమని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular