TEJA NEWS TV :అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేదవతి ప్రాజెక్టు 1000 కోట్లు నిధులు కేటాయించి నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్
*ఈరోజు హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ నుండి ర్యాలీగా నిర్వహించి ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మండల ఇంచార్జ్ తాసిల్దార్ నిజాముద్దీన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
*రాష్ట్రంలో నే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆలూరు తాగునీటికి సైతం తుంగభద్ర దిగువ కాలువపై ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు నియోజకవర్గం కరువు కాటకాలకు నిలయముగా మారి పంట పొలాలకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు నియోజకవర్గంలో గుళ్ళెం దగ్గర వేదావతి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని 8.5 టీఎంసీలు సమర్థంతో నిర్మించి 80 వేల ఎకరాలకు పైగా సాగునీరు 10లక్షల మంది ప్రజలకు త్రాగినీరు అందించవచ్చని నీ పనులు రూపకల్పన చేశారు ఈ ప్రాంతంలో కరువు ను పాల దృవ్వాలంటే వేదావతి ప్రాజెక్టు ఏకైక శరణ్యం ఈ ప్రాంత ప్రజలు చిరకాలవంచ ప్రాజెక్టు నిర్మించి భూములకు సాగునీరు ఇవ్వాలని ప్రజలుకు తాగునీరు అందించాలని గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మీద ఒత్తిడి చేయుచున్నారు ప్రభుత్వంలో పాలకులు మారుతున్న ఈ ప్రాజెక్టు మాత్రం ఒక అడుగు కూడా ముందుకు సాగలేయడం లేదని దీని కారణంగా ఈ ప్రాంత ప్రజానీకానికి తీరిని అన్యాయం జరుగుతుందని
గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలూరు జాగడం సభలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే 8.5 టీఎంసీలు సమర్ధంతో వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తామని 80000 ఎకరాలకు పైగా సాగనీరు అందించడంతోపాటు 25 గ్రామాలకు రెండు మున్సిపాలిటీలు త్రాగనీరు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన 9 నెలల కాలం పూర్తి అవుతుంది ప్రస్తుతం బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రాధాన్యత క్రమంలో వేదవతి ప్రాజెక్టును గుర్తించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1000 కోట్లు కేటాయించి నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని నియోజకవర్గము నుండి కరువును పారదోవాలని ఇక్కడ ప్రజలకు సాగునీరుతోపాటు తాగునీరు కూడా అందించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలను సమర్పించుతూ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకోపోయి వేదవతి ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటియించుటకు కృషి చేయాల్సిందిగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు ఎస్ కృష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు రంగన్న గ్రామ కార్యదర్శులు వెంకన్న అబ్దుల్ సలాం సాబ్ మస్తాన్వలి మహిళ సంఘం నాయకులు భూలక్ష్మి బసమ్మ కౌసర్ భాను తదితరులు పాల్గొన్నారు.
