TEJA NEWS TV
హోళగుంద మండల కేంద్రంలోని ఈరోజు
విద్యార్థి దశ విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మార్పు చెందుతాయని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాల నరసింహులు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హోలగుందలో సమగ్ర శిక్ష అభియాన్ సహకారంతో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు వరలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు.అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయి. అని విద్య ఉంటే ఆరోగ్యంతో పాటు జీవన్ ఉపాధి దొరుకుతుంది.సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా మంచి ఉద్యోగాలను పొందుతారు అన్నారు. మనకు ముందుగా ప్రతిదీ కష్టమే ఇష్టంతో చదివి పాఠశాలలకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు సీజనల్ హాస్టల్ అనేవి జిల్లాలో కొద్ది గొప్ప ఉంటాయి.వాటిని వలస విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.స్థానిక సీజనల్ హాస్టల్ లో అన్ని వసతులు మంచిగా ఉన్నాయి. అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థిని విద్యార్థులతో టేబుల్స్ పలికించి మంచిగా విద్యార్థులు చెప్పడంతో ఆశ్చర్యానికి గురై విద్యార్థులకు నగుదుగా బహుమతి పంపిణీ చేశారు. అనంతరం ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు, ప్రతినిత్యం దినపత్రిక చీప్ బ్యూరో హెచ్ చలపతి. మండల పాత్రికేయులు నాగరాజ్ గౌడ్, సంజయ్ కుమార్, సీజనల్ హాస్టల్ ఉపాధ్యాయులు సోహన్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద: విద్యార్థి దశ విద్యతోని జీవితాలు మార్పు చెందుతాయి – ఎస్సై బాల నరసింహులు
RELATED ARTICLES