హొళగుంద మండల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కొని మండల కేంద్రం హోళగుంద శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంతో పాటు, దక్షిణామూర్తి దేవాలయం, ఈశ్వర దేవాలయం, శ్రీరామ్ నగర్ క్యాంప్. నందు వెలిసిన ఈశ్వర దేవాలయంతో పాటు శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కుని ఉపవాస దీక్షలలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి.తమ మొక్కు బడులను తీర్చుకున్నారు. అదేవిధంగా పెద్ద కొండలో వెలిసిన సిద్ధప్పకు శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయ పురోహితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా దేవమ్మ అవ్వ దేవాలయం నందు 3 డవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవమ్మ అవ్వ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవం వైభవంగా శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి యథా స్థలం దేవమ్మ అవ్వ దేవాలయం వరకు జయ జయ ధ్వనుల మధ్య రథోత్సవాన్ని లాగి భక్తుల తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
హొళగుంద మండలంలో భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు
RELATED ARTICLES