TEJA NEWS TV : హొళగుంద మండల కేంద్రంలో బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావ్ అని దళిత ,బీసీ నాయకులు కొని ఆడారు న 117 జయంతి ఉత్సవాలను ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం ఆలు పెరగని పోరాటం చేసి వారి హక్కులను కాపాడిన ఏకైక మహానుభావుడు బాబు జగజీవన్ రావు అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త అన్నారు భారత పార్లమెంటులో వివిధ శాఖల మంత్రిగా వ్యవహరించడమే కాకుండా ఉప ప్రధానిగా పనిచేసిన మహా మేధావి అన్నారు కార్మిక ఉద్యమాన్ని నిర్వహించి కార్మికులకు రావలసిన హక్కుల అధికారాలను కాపాడి నేనున్నాను మీకు అండగా అంటూ వారి బతుకులు వెలుగులు నింపారన్నారు 27 ఏళ్ల వయసులోని 1935లో బీహార్ నుంచి ఎమ్మెల్యే కి గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రజలకు ఎలా సేవలందించాలో గుర్తుచేసి నాటి నేటి తరానికి ఆదర్శప్రాయుడు నిలిచారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్, బుడగ జంగాల తాలూకా నాయకులు మాదిగ రామాంజనేయులు దళిత నాయకులు దేవేంద్ర బుడగ జంగాల నాయకులు ముగ్గు గోవిందు, కొండయ్య, ధూపం అంబులు, దూదేకుల సంఘం నాయకులు హుసేని, రంజాన్ సాబ్ చలవాది రంగప్ప, తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద: బడుగు బలహీనవర్గాల ఆశ జ్యోతి బాబు జగజ్జివన్ రావు
RELATED ARTICLES