Tuesday, December 9, 2025

హొళగుంద :చంద్రన్న పాలన చరితాత్మక పాలన సంక్షేమానికి సాక్ష్యమై కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు

TEJA NEWS TV
తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి, మాజీ మండల కన్వీనర్ కోనేరు దుర్గయ్య, టిడిపి పట్టణ కన్వీనర్ కే మల్లికార్జున తదితర నాయకుల ఆధ్వర్యంలో
హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీ, బుడగ జంగాల కాలనీ, బుడబుక్కల కాలనీలలో పసుపు ప్రభజనమై కొనసాగిన ప్రతిష్టిత *”సుపరిపాలనలో తొలి అడుగు”* కార్యక్రమం

దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయని సంక్షేమ ప్రతిఫలాలను ప్రజలకు నేరుగా అందించే సంకల్పంతో దేశ దిశ, దశను సూచించగల బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు ప్రజల గుండెచప్పుడు మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ పాలనలో దిగ్విజయంగా  ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా *సుపరిపాలనలో తొలి అడుగు* పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వాడవాడలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక ఉద్యమంగా కూటమి ప్రభుత్వపు సంక్షేమ సాధికారతను ప్రజలకు వివరిస్తూ, ప్రజల సాధక బాధకాలను ఆలకిస్తూ గడపగడపకు ప్రభుత్వ పాలనను చేరవేయడం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టడమే కాక మన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చి వేసిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమాత్రం సడలకుండా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుతోపాటు మన రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిక్షణం కూడా పరితపిస్తోందన్నారు దానికి తోడుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి టిడిపి నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ శకానికి తోడుగా సాయుధులై నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular