Monday, February 10, 2025

హొళగుందలో వైసీపీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం

*హొళగుంద మండలం నాగరకన్వి, హొన్నూరు, హొన్నూరు క్యాంప్ గ్రామాల నాయకుల సమావేశంలో… శ్రీ బుసినే శ్రీరాములు గారు*

**ఈరోజు ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం నాగరకన్వి, హొన్నూరు, హొన్నూరు క్యాంపు గ్రామాలలో ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ బుసినే విరుపాక్షి గారి ఆదేశాల మేరకు శ్రీ బుసినే విరుపాక్షి గారి సోదరుడు శ్రీ బుసినే శ్రీరాములు గారి ఆధ్వర్యంలో  ముఖ్య నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో సమావేశం జరిగింది*

**ఈ సమావేశంలో శ్రీ బుసినే శ్రీరాములు గారు మాట్లాడుతూ*

*పెద్దచదవులు చదవాలన్నది పేద పిల్లల కల వారి కల నా కల అంటూ సాకారం చేసిన సీఎం వైయస్ జగనన్న*

*మహిళా సాధికరతపై ఇంతగా దృష్టి పెట్టి సాధించిన ఏకైక నేత మన జగనన్న*

*రాష్ట్రంలోని మహిళలను తన సొంత అక్కచెల్లమలుగా భావించి,అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా,వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు వారికి ఆర్ధికంగా సాయం చేసారు మన జగనన్న*

*రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటదని నమ్మిన మన జగనన్న*

*రైతన్నల సంక్షేమం కోసం, రైతులు తమ భూములని ఎల్లప్పుడు పచ్చటి పొలాలుగా చూసుకోవాలనే కలని నిజం చేయడం కోసం ఎన్నో పధకాలనీ ప్రవేశపెట్టాడు మన జగనన్న*

*జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగనన్నను చేసుకోవడానికి మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని శ్రీ బుసినే శ్రీరాములు గారు అన్నారు**
.
*ఈ ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశంలో హొళగుంద మండలం మరియు నాగరకన్వి, హొన్నూరు, హోన్నూరు క్యాంపు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular