

విజ్ఞాన శాస్త్రవేత్తల అగ్ర గన్యుడు సివి రామన్,
కర్నూల్ జిల్లా ఆలూర్ తాలూక్ హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు
విజ్ఞాన శాస్త్రవేత్తల అగ్ర గన్యుడు సివి రామన్ అని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ ఎస్ హెచ్ జి, వరలక్ష్మి ఎస్ హెచ్ జి. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సౌజన్యంతో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్లో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటామని గుర్తు చేశారు, భారతీయులకు నోబుల్ బహుమతి రావడం అనేది కలగానే మిగిలి ఉండేది అలాంటిది సివి రామన్ సరికొత్త చరిత్రను సృష్టించాడు భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి రావడం గర్వించదగ్గ విషయం అన్నారు మన భారతదేశం నుండి ఇతర దేశాలకు పరిశోధన కోసం వెళ్లాలని ఆలోచన సివి రామన్ తిరిగిరాచారని ఇతర దేశాల వాళ్లు మనదేశంలో కూడా సివి రామన్ లాంటి వ్యక్తులు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు అవసరమైతే భారతదేశానికి మేము కూడా పరిశోధన కోసం వెళ్లవలసి వస్తుందని చర్చించుకోవడం జరిగిందన్నారు. గుర్తు చేశారు సీజనల్ హాస్టల్ ఉపాధ్యాయులు సోహెబ్, దుర్గయ్యలు సైన్స్ ప్రాజెక్టు లు విద్యార్థులకు ప్రాక్టికల్ గా చూపించారు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి, వ్యవసాయ శోపనాలు, గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, నీటి కాలుష్యం వంటి విషయాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సీజనల్ హాస్టల్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.