TEJA NEWS TV
తనిఖీలో రూ.75.971/- రికవరీ, రూ.40,000/- పెనాల్టీ బహిర్గతం
నెరణికి గ్రామంలో అత్యధికంగా రూ.38,237/- రికవరీ, లింగదహళ్ళిలో రూ.20.426/- రికవరి
హొళగుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 17వవిడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపిడి పద్మావతి, డివీఓ లోకేశ్వర్, ఎంపీడీవో విజయ లలితలు ముఖ్య అతిథులుగా వ్యవహరించారు. 2023 2 1 ລ້ 2024 మార్చి 31 వరకు మండలంలోని 17 గ్రామాల్లో చేపట్టిన వివిధ పనులపై నివేదికలను చదివి వినిపించారు. మండలంలో మొత్తం రూ.11 కోట్ల 64 లక్షల 70వేల 460 రూపాయల ఖర్చు చేశారని అధికారులు తెలిపారు. ఈ పనులపై తనిఖీ నిర్వహించగా ఉపాధి హామీ సిబ్బంది పని ప్రదేశంలో కూలీల మస్టర్లపై సంబంధిత అధికారులు రోల్ కాల్ చేయకపోవడం, కొలతల్లో తేడాలు, మస్టర్ల హాజరు గణన లెక్కింపులో తప్పిదాలు, పని ప్రదేశం తేడాలు వంటి తప్పిదాలపై మండలంలోని 17 గ్రామాలకు గాను రూ.75,971/- రికవరీ, మరియు పెనాల్టీగా రూ. 40,000/- ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే నెరణికి గ్రామంలో అధికంగా రూ.38,237/- 2వస్థానం లింగదహళ్ళిలో రూ.20,426/-, రికవరీ లో తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ భక్తవత్సల్యం, ఎస్ఆర్పి భాస్కర్, ఏఈ సోమప్ప, పలు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ లు, సామాజిక తనిఖీ బృందం, సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
