తేజ న్యూస్ టివి ప్రతినిధి
రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గురువారం రోజు పరకాల రూరల్ మండలం కామారెడ్డిపల్లి గ్రామంలోని ఉపాధి హామీ పథకం పనుల వద్ద ఉపాధి కూలీలను కలిసి గత 10 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటరు మహాశయులను కోరారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో 61,62 బూత్ అధ్యక్షులు కోరే సురేష్, తండ కుమారస్వామి ,సీనియర్ నాయకులు కొమ్మిడి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిర్ర చక్రపాణి ,జిల్లా మెడికల్ కన్వీనర్ కాసగాని రాజ్ కుమార్ , మండల ఉపాధ్యక్షులు జన్ను లింగయ్య , ఓబీసీ మోర్చా కార్యదర్శి దానం ఓదెలు ,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్ , బీజేవైఎం నాయకులు తడుక సురేష్ ,గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ ప్రమోద్ కుమార్ ,సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
హుజురాబాద్ లో జోరుగా సాగుతోన్న బిజెపి ప్రచారం
RELATED ARTICLES