


Teja News TV.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పరిగి రోడ్ లో ఆదివారం నాడు, మార్బుల్ గ్రానైట్ టైల్స్ వర్కర్స్ యూనియన్ వారు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు “గుడ్డంపల్లి వేణు రెడ్డి..ఈ సందర్భంగా మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ టైల్స్ వర్కర్స్ వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను యూనియన్ సభ్యులు గుడ్డంపల్లి వేణు రెడ్డి, దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా గుడ్డంపల్లి వేణు రెడ్డి, మాట్లాడుతూ మార్బుల్స్ అండ్ గ్రానైట్ టైల్స్ వర్కర్స్ వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆసిఫ్, రహమాత్ పూర్ ఫరూక్,అసోసియేషన్ ప్రెసిడెంట్ షామీర్, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సాదిక్, జనరల్ సెక్రెటరీ గంగాధర్ ,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.