Friday, January 24, 2025

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా దారుణం -మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి

TEJA NEWS TV : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీల  గురించి మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ట్రస్ట్ కింద 11329 కేజీ ల బంగారం ఉంది. అది కూడా 2023 లో ఇప్పుడు… అది ఇప్పుడు 13 వేల టన్నులు కూడా అయిండొచ్చు,సిల్వర్ అయితే లెక్కే లేదు.క్యాష్ అయితే 80 వేల కోట్లు పైనే ఉంది. సంవత్సరానికి వెయ్యి (1000)కోట్ల కంటే ఎక్కువ హుండీ విరాలాలె ఉన్నాయి. టెంపుల్ మైంటెన్స్ కు సంవత్సరానికి 5000 కోట్లు బడ్జెట్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కరోజుకి ముడున్నరా లక్షలు(3.5Lac) లడ్డులు తయారవుతున్నాయి. దాంట్లో ఇ నెయ్యి బదులు ఈ చీప్ ప్రాడక్ట్స్ వాడి  10కోట్లు  సేవ్ చేశారు. ఈ పది(10) కోట్లు సేవ్ చేయడానికా ఆ నెయ్యిని కల్తీ చేసింది. ఈ వ్యాల్యూషన్ చూసిన తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఈ కల్తీ చేసింది లడ్డూలు ఒక్కటే కాకుండా వేరే ఉన్న మిగిలిన ప్రసాదంలో కూడా కల్తీ చేశారా.. పది కోట్లు సేవ్ చేసుకోవడానికి సప్లయర్ని కూడా మార్చేసింది ఈ సైకో ప్రభుత్వం. దీన్ని మీద కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వయిరీ చేసింది. నేను అందరికి ఒక్కటే చెప్తున్నా భక్తుల నమ్మకంతో ఎవ్వరు ఆడుకోవద్దు. ఎవరైతే ఈ పని చేశారో వాళ్లకి గ్యారెంటీగా శిక్ష పడుతుంది అది కూడా మన ప్రభుత్వంలోనే జరుగుతుంది.అలాగే ప్రజలకు తెలియాల్సిన ఇంకో విషయం ఏమంటే అక్కడ రోజు జరిగే అన్నదానం చేసే కార్యక్రమంలో  కల్తీ మరియు మెయింటినెన్స్ లో కూడా,అలాగే 160 గ్రాములు ఉన్న లడ్డును 90 గ్రాములకు చేసి దానిలో కూడా కల్తీ చేసిన జగన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా నిలదీస్తున్న.. గవర్నమెంట్ కు ఈ ట్రస్ట్ ని హ్యాండిల్ చేయడమే కాకుండా దాని నుండి ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ 50 కోట్లు ట్రస్ట్ నుండి తీసుకుంటుంది..అలాంటిది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మోసం లేకుండా కల్తీ కాకుండా చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి.. అలాంటిది గత వైసిపి ప్రభుత్వం మాత్రం కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా దారుణం అని మీడియా ముఖంగా మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular