హద్దులు దాటుతున్న మద్యానికి అడ్డుకట్టేది
– పార్పల్లి కేంద్రంగా అక్రమ మద్యం తరలింపు
– హోల్సెల్ పేరుతో అధిక ధరలకు మద్యం అమ్మకాలు
– ధనార్జనే ద్యేయంగా అక్రమార్కుల మద్యం హోం డెలివరీ
– యదేశ్చగా పక్కరాష్ట్రానికి మద్యం తరలింపు
– నిమ్మకు నీరెత్తనట్లు అధికారుల తీరు
కోటపల్లి మండలం పార్పల్లి గ్రామం కేంద్రంగా చేసుకొని అక్రమ మద్యం దందా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్పెల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడిన ఓ వైన్ షాప్ నుండి అక్రమంగా ప్రయివేటు వాహనాల్లో హోం డెలివరీ చేయడమే కాకుండా ఎమ్మార్పి ధరల కంటే ఎక్కువ రెట్లకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని, నాటు పడవల్లో మహారాష్ట్రకు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మారుమూల ప్రాంతాలనే ఆసరాగా చేసుకొని గత కొంత కాలంగా మండలానికి చెందిన ఓ బీఆర్ఎస్ నేత కీలకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, పల్లె ప్రాంతాలకు మద్యం అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ, కోటపల్లి మండల మద్యం వీరప్పన్ గానూ పేరుగాంచాడని స్థానికులు చెబుతున్నారు. పల్లె ప్రాంతాలలో నిర్వహిస్తున్న బెల్టు షాపుల కారణంగా అమాయక ప్రజలు మద్యానికి బానిసై పలు కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతుండగా, ఆబ్కారీ అధికారులు సైతం అక్రమార్కులకు కొమ్ము కాస్తుండగా అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని, మద్యం అమ్మకాలకు సంబంచింది వైన్ షాపుల్లో రికార్డులు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మామూలుగానే తీసుకుంటుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పయికైనా సంబంధిత అధికారుల తీరు మార్చుకొని, అక్రమ మద్యం దందాకు అడ్డుకట్ట వేసి, అమాయక ప్రజల జీవితాలను కాపాడుతూ, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మహారాష్ట్రకు అక్రమంగా తరలిసిస్తున్న మధ్యాన్ని అధికారులు నివారించాలి
– జాడి రాజేందర్, కాంగ్రెస్ మండల యూత్ ప్రెసిడెంట్
పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మద్యం రవాణాను అధికారులు నివారించడమే కాక, పల్లె ప్రాంతాలలో నిర్వహిస్తున్న బెల్టు షాపుల నిర్వహణను నిలిపి వేసేందుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం మారినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు లేకుండా పోతుంది. ధనార్జనే ద్యేయంగా ఓ బీఆర్ఎస్ నేత పార్పల్లి గ్రామంలోని వైన్ షాపును అడ్డాగా చేసుకొని, పల్లె ప్రాంతాలకు మద్యం హోం డెలివరీ చేయడమే కాకుండా, నాటు పడవల్లో మహారాష్ట్రకు అక్రమంగా మద్యం తరలిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారులు అతని అక్రమ దందాను అడ్డుకోకపోగా, అండగా నిలిస్తూ, అమాయక ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అక్రమ మద్యం దందాను అడ్డుకొని అమాయక ప్రజల జీవితాలు నాశనం కాకుండా అధికారులు చూడాలి.
వైన్ షాపు అమ్మకాలపై తనిఖీలు నిర్వహిస్తాం
– హరి, చెన్నూరు ఎక్షైజ్ సిఐ
నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు, అక్రమ మార్గంలో మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే ఎంతవరైనా చర్యలు తప్పవు. పార్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వైన్ షాప్ అమ్మకాలపై తనికీలు నిర్వహించి, చర్యలు తీసుకుంటాం
హద్దులు దాటుతున్న మద్యానికి అడ్డుకట్టేది ?
RELATED ARTICLES