Teja News TV శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం..
హిందూపూర్ రూరల్ చౌలూరు గ్రామంలో ఆదివారం వైసిపి మాజీ సమన్వయకర్త స్వర్గీయ చౌలూరు రామకృష్ణారెడ్డి, ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, ప్రజలు హాజరై ఘననివాళిలు అర్పించారు.
మొదటిగా చౌళూరు రామక్రిష్ణ రెడ్డి, కుటుంబ సభ్యులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కి వీరాభిమాని ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగా ఉంటూ వైసిపి బలోపేతం కోసం ఎంతగానో కృషిచేసిన రామకృష్ణారెడ్డి మన ముందు లేకున్నప్పటికీ ఆయన సహకారంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు స్థిరస్థాయిగా ఉన్నాయని వైసిపి కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమానికీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , పెనుకొండ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సానే ఉమారాణి ,మద్దెల చెరువు సుధీర్ రెడ్డి , వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి, నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు, చౌళూరు రామకృష్ణారెడ్డి అభిమానులు, వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
స్వర్గీయ చౌలూరు రామకృష్ణా రెడ్డి, ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన వేలాది మంది అభిమానులు
RELATED ARTICLES