-నేడు జరిగిన కార్యకర్తల సమావేశం.
-మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు విజ్ఞప్తి.
-ఈనెల 14న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.
-అభిమానుల అధిష్టా సమావేశంలో స్పష్టం చేసిన ఉమా…
-భావోద్వేగాలతో సమరానికి సై అంటు..
-ఉమా అన్న నీవెంట మేము నడుస్తాం అన్న అభిమానులు.
కళ్యాణదుర్గం
రానున్న సార్వత్రిక ఎన్నికలలో కళ్యాణదుర్గం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని మాదినేని, ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ,అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 14 నుండి కళ్యాణదుర్గం శాసనసభ్యులు, స్వతంత్ర అభ్యర్థిగా మాదినేని, ఉమా ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టేలా నిర్వహిస్తానని వివరించారు. తద్వారా తన అభిమానులు కార్యకర్తలు మీ మద్దతు తనకు ప్రకటించి మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యకర్తలు మాట్లాడరు.కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి గ్రామం వ్యాప్తంగా ఎక్కడ పేదల సమస్యలు ఉత్పన్నమైన, అక్కడకి ఈగలా వాలి తనదైన శైలిలో స్పందించి, అక్కడ ప్రత్యక్షమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాసేవే పరమావధిగా భావించి సమర్థవంత నాయకుడిగా పనిచేశానని వివరించారు. అంతేకాకుండా అధికార పార్టీ పాలకులు ఎన్ని ఇబ్బందులకు ఉమా కు గురిచేసిన, పోలీస్ కేసులు పెట్టిన అదరకుండా, బెదరకుండా ప్రభుత్వ వైఫలాలను ఎండగట్టి, గత ఐదేళ్లగా త్రికరణ శుద్ధిగా పనిచేసిన ప్రతిపక్ష నేతగా మా ఉమా అన్న ఎదిగారన్నారు. అంతేకాకుండా మలైయనూరు, నిజవల్ల గ్రామాలలో సర్కార్ భవనాలు నిర్మాణం విషయంలో పేదలకు అన్యాయం జరుగుతుందంటే పేదల పక్షాన నిలిచి, ఆయన సొంత డబ్బుతో న్యాయస్థానం ఆశ్రయించి పేదల పచ్చన పోరాడిన దీశాలన్నారు. బావోగ్వేదాలతో గురై సమరానికి సై అంటూ ఉమా అన్న నీ వెంట మేము సైతం నడుస్తామంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్, సార్వత్రిక ఎన్నికలు బరిలో ఉంటారా లేదా అని కుందుర్పి స్టార్ ప్రభ విలేకరి చరవాణిలో ఆయనను వివరణ కోరగా తాను ఎన్నికల బరిలో తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగతానని, ఈ విషయం ముమ్మాటికి వాస్తవమని ఆయన తెలిపారు.
స్వతంత్ర అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల బరిలో ఉమా….
RELATED ARTICLES