
TEJA NEWS TV :
ఎన్నో సంత్సరాలుగా స్మశానం లేక చెరువుగట్లు, పొలం గట్లు, వాగు వంకలు వారన మృతదేహాలను పూడ్చి పెడుతున్నామని స్మశాన స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం గ్రామ దళితులు సంజీవ రాయుడు , బాల గురయ్యా , ప్రవీణ్ యేసయ్య ఓబన్న, ఓబులేసు వెంకటపతి చెన్నయ్య సుమారు 40 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలుమార్లు స్మశాన స్థలం కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికిని సంబంధిత అధికారులుస్పందించడం లేదన్నారు. కనీసం దళితునికి స్మశానంలో నైనా సమానత్వం కల్పించండి అంటూ అధికారులను ప్రజా ప్రతినిధులను విన్నవించినా ఫలితం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారానైనా స్మశాన స్థలం కోసం భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని వారు కోరారు. అధికారులు స్పందించకుంటే జిల్లా కలెక్టర్ కు తెలియచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి తమ గోడును విన్నవించుకుంటామని తెలిపారు.