-సీఎం జగన్ జీవో పత్రికలకే పరిమితం.
-స్థలం లేక అప్పలేపల్లిలో 200 కుటుంబాల తీవ్ర ఇక్కట్లు.
-డిటికె వినతిపత్రం సమర్పించిన, ఎమ్మార్పీఎస్ నాయకులు, దళితులు. -పలుమార్లు అధికారులకు వినతులు అందించిన చర్యలు శూన్యం.
-ఇకనైనా స్థలం కేటాయించాలి.
కళ్యాణదుర్గం,కుందుర్పి, ( తేజ టీవీన్యూస్);
మండల పరిధిలోని అపిలేపల్లి గ్రామంలో స్మశాన వాటిక స్థలం లేక 200 మంది కుటుంబాలకు దళితులకు తీవ్ర ఎక్కట్లేదు అనుకుంటున్నారు. ఇదే తరహాలో మండలంలో పలు గ్రామాల్లో సమస్య ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. మంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచే వెళ్లిన నేటికి దళితులకు స్మశాన వాటిక స్థలం కేటాయించకపోవడం బాధాకరం అన్నారు.ఇప్పటికైనా అపిలేపల్లిలో దళితులకు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరుతూ స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం డిటిఆర్ తిప్పే స్వామికి దళితులు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ దళితులకు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని జీవో కూడా జారీ చేశారు. కానీ ఈ జీవో కార్యచరణ నేర్చుకోవడం లేదన్నారు. సీఎం జీవో కేవలం పత్రికలకే పరిమితం అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులకు పలుమార్లు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని అనేకసార్లు వినతి పత్రాలు అందించిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని వివరించారు. తటికైనా ప్రభుత్వ భూమిని రెండు ఎకరాలు స్మశాన వాటిక దళితులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్మశాన వాటిక స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీటీని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, మండల ఇంచార్జ్ ఎన్, మూర్తి, కృష్ణాపురం గ్రామ, మారుతి, ఎస్సీ కాలనీ వాసులు, టి, ఆంజనేయులు, జిల్లా రామాంజనేయులు, ఈ ఎనమప్ప, డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
స్మశాన వాటిక స్థలం లేక… తీవ్రై కట్లలో దళితులు
RELATED ARTICLES