వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అమరచింత బీజేపీ నగర శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి సభ్యత్వ నమోదు కన్వీనర్లు కర్నే స్వామి,బాలరాంరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ మూడవ తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పార్టీలోకి నూతనంగా వచ్చే వారికి భారీ ఎత్తున సభ్యత్వాలు చేర్పించాలని కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇంటింటికి చేరేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని భారీ ఎత్తున బిజెపి పార్టీకి పార్టీ సభ్యత్వాలు తీసుకురావాలని, స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని, తమ వంతు కర్తవ్యంతో బూత్ స్థాయి ఏజెంట్లు బూతులను బలోపేతం చేసే విధంగా పనిచేయాలని పలు సూచన సలహాలను తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
RELATED ARTICLES