సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి వి నాగరాజు
సంగెం మండల కేంద్రంలోని ఒక పేద కుటుంబం తల్లిదండ్రులు గూడెల్లి సుజాత సుధాకర్, తల్లి సుజాత టైలరింగ్ తండ్రి సుధాకర్ చిన్న కిరణా షాప్,వీరికి ఇద్దరు ఆడపిల్లలు,వీరిని ఎంతో కష్టపడి చదివించినందుకు చిన్నమ్మాయి నవ్య స్టాఫ్ నర్స్ ఎంపికయింది. ఈ శుభసందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు,అలాగే డిఎంహెచ్ఓ నవ్య ను అభినందించారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమానంగా చదువనిద్దాం, ఎదగనిద్దాం, ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడితే, ప్రతి అమ్మాయి కుటుంబ, సమాజం బాధ్యత తీసుకుంటుందని నిరూపించింది. స్టాఫ్ నర్స్ నియామకపత్రం నవ్యకు అందిస్తూ ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ, జిల్లా కేటాయించిన నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. నియమక పత్రాలు పొందిన వారు వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించిన వీధుల్లో చేరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఎంపికైన నర్సులు ఆయన అభినందించారు.
స్టాప్ నర్సు నవ్యకు నియామక పత్రాలను అందజేసిన వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ
RELATED ARTICLES