Wednesday, January 15, 2025

స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
24-10-2024
కొత్తగూడెం పట్టణం.


*రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడొద్దు*

*ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి*
*ఫహీమ్ దాదా*

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,  స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం కమిటీ ఆధ్వర్యంలో  కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్* జిల్లా *కార్యదర్శి ఫహీమ్* *దాదా* మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,  స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్యం చేస్తే విద్యార్థులు చదువుకునేది ఎట్లా అని, ఫీజు బకాయిల విడుదల పై ప్రభుత్వం చేస్తున్న జాప్యం సరికాదని.
గత మూడు విద్యాసంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల లేక విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇబ్బందులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు చెల్లించలేక  ప్రైవేట్ డిగ్రీ,పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూన్నాయని. ఫీజుబకాయిలు  విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేసిన ప్రభుత్వం విడుదల చేయకుండా పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు .
గత ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ఆనాటి పీసీసీ అధ్యక్షుడు , నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి,  అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న  ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని  విద్యాశాఖ కూడా తన వద్దే పెట్టుకున్న విద్యాశాఖ కి నిధులు కేటాయించి విద్యార్థులకు ఖర్చు చేయడం లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని,
రాష్ట్రంలో అనేక రకాల ఖర్చులు చేస్తూ అనేక చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయడంలో చేస్తున్న నిర్లక్ష్యం సరికాదని  వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు టోకెన్ ఇచ్చినవి కాకుండా పెండింగ్ లో ఉన్న బకాయిలు మొత్తం ఒకే సారి  విడుదల చేయాలని లేని యెడల  విద్యార్థుల సమీకరించి భవిష్యత్తును ఉద్యమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 27 లోపు బకాయిలు చెల్లించకపోతే  చలో ఇంద్ర పార్క్ కార్యక్రమం నిర్వహించే హైదరాబాద్ నీ దిగ్భంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరక అజిత్, షాహిద్, గుగులోత్ వంశీ, పవన్ సాయి, సృజన్, బానోత్ శ్రీను, వినయ్, నాగేంద్రబాబు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular